Breaking News

Bangarraju : అక్కినేని అభిమానులకు పండగే.. ఒకటి కాదు రెండు సర్‌ప్రైజెస్!


నాగార్జున స్పీడు పెంచేశాడు.. కొడుకు నాగ‌చైత‌న్యతో క‌లిసి వెండితెర‌పై బంగార్రాజుగా సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. కాగా.. న‌వంబ‌ర్ 23న నాగార్జున త‌న‌యుడు, హీరో నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు, ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు రెండు స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వ‌డానికి టీమ్ రెడీ అయిపోయింది. ‘వాడివాడి త‌స్సాదియ్యా బంగార్రాజు సంద‌డి లేక‌పోతే ఎలా’ అంటూ అప్‌డేట్స్‌కు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో క‌ర్ర‌ను ప‌ట్టుకున్న ఓ చేయి క‌నిపిస్తోంది. మూవీ ఫ‌స్ట్ లుక్‌ను న‌వంబ‌ర్ 22 సాయంత్రం 5 గంట‌ల 22 నిమిషాల‌కు, టీజ‌ర్‌ను న‌వంబ‌ర్ 23 ఉద‌యం 10 గంట‌ల 23 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. పుట్టిన‌రోజు చైత‌న్య‌ది కాబ‌ట్టి చైత‌న్య లుక్ రిలీజ్ చేస్తారా? లేక నాగార్జున లుక్ రిలీజ్ చేస్తారా? లేక నాగ్‌, చైతు ఇద్ద‌రి లుక్స్ రిలీజ్ చేస్తార‌నేది తెలియ‌డం లేదు. సోగ్గాడే చిన్ని నాయ‌నాకు ఇది సీక్వెల్‌. ఇందులో నాగార్జున మ‌న‌వ‌డు పాత్ర‌లో నాగ‌చైత‌న్య క‌నిపించ‌బోతున్నాడు. చైతు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి క‌నిపించ‌నుంది. రీసెంట్‌గా నాగ‌ల‌క్ష్మి అనే పాత్ర‌ను చేస్తున్న కృతి శెట్టి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే ల‌డ్డుండా అనే లిరిక‌ల్ సాంగ్ రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగార్జున స‌ర‌స‌న మ‌రోసారి ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్నారు. నాగార్జున కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నాకు సీక్వెల్‌గా వ‌స్తున్న బంగార్రాజు ఈ సంక్రాంతికి బ‌ల‌మైన పోటీలో నిల‌బ‌డ‌తాడో లేదో చూడాలి. మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్.. పక్కా యాక్షన్ మూవీ ఘోస్ట్‌లోనూ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన రా ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. బంగార్రాజు కంటే ముందే ఘోస్ట్ సినిమా మొదలైన ముందుగా వచ్చేది మాత్రం బంగార్రాజు సినిమానే. బిగ్‌బాస్ సీజ‌న్ 5 కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇక చైత‌న్య విష‌యానికి వ‌స్తే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ సినిమాతో పాటు అమీర్ ఖాన్‌తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దాలో న‌టించాడు. త్వ‌ర‌లోనే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్‌లో చైత‌న్య న‌టించ‌బోతున్నాడు. హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.


By November 20, 2021 at 11:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bangarraju-first-look-and-teaser-release-dates-confirmed/articleshow/87812892.cms

No comments