స్నేహితుడని నమ్మి వెళితే... 14 ఏళ్ల బాలికపై ముగ్గురి గ్యాంగ్ రేప్
లాక్‌డౌన్ సమయంలోనూ కామాంధుల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. లాక్‌డౌన్‌లో తొలి రెండు వారాల్లో క్రైమ్ రేట్ భారీగా తగ్గగా.. కొద్దిరోజులుగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. జింద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. Also Read: గ్రామంలో నివసించే 14 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే బాలుడి(16)తో కొద్దిరోజులుగా పరిచయం ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు ఆమె ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి స్కూల్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ బాలుడి ఇద్దరు ఫ్రెండ్స్ మాటువేశారు. ముగ్గురు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి బాలికను విడిచిపెట్టారు. Also Read: ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అలెవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు బాలురపై కిడ్నాప్, అత్యాచారం కేసులతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు బాలుర కోసం గాలింపు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By April 26, 2020 at 11:22AM
No comments