Breaking News

బాలయ్యతో కయ్యానికి రోజా ఒప్పుకుంటుందా..?


బాలకృష్ణ - రోజాలు కలిసి చాలా సినిమాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరొందినా.. ప్రస్తుతం రోజా - బాలకృష్ణలు రాజకీయ ప్రత్యర్ధులు. వైసీపీ నుంచి రోజా, టీడీపీ నుంచి బాలయ్య కయ్యానికి ఎప్పుడూ కాలుదువ్వుతారు. ఇక బాలయ్య హీరోగా, రోజా మాత్రం జబర్దస్త్‌కి జడ్జ్‌గా, బతుకు జట్కాబండికి యాంకర్‌గా పనిచేస్తూ బుల్లితెర మీద బిజీగా ఉంటూ ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్‌గా కనిపిస్తూ వెండితెరకు కాస్త దూరంగానే ఉంటుంది. తాజాగా బాలకృష్ణ సినిమాలో రోజా పవర్ ఫుల్ విలన్ పాత్ర వెయ్యబోతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో త్వరలో మొదలు కాబోతున్న సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం రోజాని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది.

బాలయ్య సినిమాలో రోజా విలనిజం పండిస్తే ఆ సినిమాకి భారీ క్రేజ్ వస్తుందని దర్శకుడు బోయపాటి భావిస్తున్నాడట. ఎలాగూ తాను బాలయ్య కోసం ప్రిపేర్ చేసిన కథలో ఓ పవర్ లేడీ విలన్ పాత్ర ఉండడంతో.. ఆ పాత్రని రోజాతో చేయిస్తే... బాలయ్య సినిమాకి మరింత క్రేజ్ యాడ్ అవుతుంది అని బోయపాటి ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం రూలర్ సినిమాతో బిజీగా వున్న బాలకృష్ణ ఆ సినిమా విడుదల కాగానే బోయపాటి సినిమా కోసం రెడీ అవుతాడని, ఈలోపు బోయపాటి నటీనటుల ఎంపికతో పాటుగా పూర్తి స్క్రిప్ట్ ని లాక్ చేసి బాలయ్య కోసం రెడీగా ఉంటాడని తెలుస్తుంది. మరి రోజా ఒప్పుకుంటే.. బయట రాజకీయ ప్రత్యర్థులైన రోజా, బాలయ్య‌లు స్క్రీన్ మీద ఎలా ఢీ కొడతారో చూడాలి. 



By November 28, 2019 at 03:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48457/boyapati-srinu.html

No comments