చిత్తూరు జిల్లాలో దారుణం.. పెళ్లిలో చిన్నారిపై ఎత్తుకెళ్లి హత్యాచారం

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కురబలకోటలో చిన్నారిపై దుండగులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. గురువారం రాత్రి కురబలకోటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లికి ఓ దంపతులు తమ కుమార్తెతో కలిసి హాజరయ్యారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వారు ఏమరపాటుగా ఉండటంతో చిన్నారి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయింది. Also Read: చిన్నారిపై కన్నేసిన కొందరు కామాంధులు ఆమెను ఎత్తుకెళ్లి ఫంక్షన్ హాల్ వెనుకే అత్యాచారం చేశారు. తమ గురించి చిన్నారి ఎవరికైనా చెబుతుందన్న ఆందోళనతో గొంతు నులిమి చంపేశారు. పాప కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల వెతికారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గమనించి షాకయ్యారు. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను అత్యాచారం చేసి చంపేసినట్లు తేలడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అభంశుభం తెలియని చిన్నారిపై కర్కశంగా లైంగిక దాడికి పాల్పడి చంపేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు. Also Read:
By November 08, 2019 at 08:50AM
No comments