Breaking News

`మీకు మాత్రమే చెప్తా` హీరో అందరికీ చెప్పేశాడు!


షార్ట్ ఫిలింస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని తరువాత పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు తరుణ్ భాస్కర్‌. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్‌, తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరోసారి తన మార్క్‌చూపించాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్‌ హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. మహానటి, ఫలక్‌నుమా దాస్‌ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తరుణ్‌ భాస్కర్‌, ఇటీవల విడుదలైన సినిమాతో హీరోగానూ ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్‌ నటనకు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా తరువాత హీరోగా కొనసాగుతాడా లేక, దర్శకుడిగా కొనసాగుతాడా అన్న చర్చ జరుగుతోంది. Also Read: అయితే ఈ విషయాలపై తరుణ్‌ భాస్కర్‌ హింట్ ఇచ్చాడు. మీకు మాత్రమే చెప్తా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో పాటు తన బర్త్‌ డే పార్టీని కూడా ఇటీవల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్‌. ఈ వేడుకల్లో తనతో పాటు షార్ట్‌ ఫిలింస్‌, ఈ నగరానికి ఏమైంది సినిమాలకు పనిచేసిన టీంతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో తరుణ్‌తో పాటు ఫలక్‌నుమాదాస్‌ హీరో విశ్వక్‌సేన్‌, కమెడియన్‌ అభినవ్‌ గోమటంలతో పాటు ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించిన సుశాంత్ రెడ్డి, వెంకటేష్‌ కుకుమానులు ఉన్నారు. ఈ ఫోటోతో పాటు `ఈ బాయ్స్‌ తిరిగి వస్తున్నారు. మీరు అనుకున్న దానికంటే ముందుగా` అంటూ కామెంట్ చేశాడు. Also Read: అంటే త్వరలోనే ఈ నగరానికి ఏమైంది సినిమా టీంతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు తరుణ్ భాస్కర్‌. అయితే ఈ సినిమాకు తరుణ్ కేవలం దర్శకుడిగానే వ్యవహరిస్తాడా..? లేక నటుడిగానూ చేస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. నిర్మాతగా మారి రూపొందించిన మీకు మాత్రమే చెప్తా చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. దీంతో తరుణ్‌కు నటుడిగా కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.


By November 08, 2019 at 08:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-actor-tharun-bhascker-gears-up-for-his-next-project/articleshow/71964838.cms

No comments