Breaking News

బాలకృష్ణపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌


నందమూరి బాలకృష్ణకు ఘోర అవమానం జరిగింది. గత జనరేషన్‌ టాప్ హీరోలలో ఒకడిగా తిరుగులేని మాస్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరో బాలయ్యను ఓ తమిళ స్టాండప్‌ కమెడియన్‌ ఘోరంగా అవమానించాడు. చిరంజీవి తరువాత టాలీవుడ్‌ బెస్ట్ డ్యాన్స్‌ అన్న పేరున్న బాలయ్యపై అలెగ్జాండర్‌ బాబు అనే అలెగ్జాండర్‌ బాబు వేదిక మీద నవ్వులు పూయించేందుకు ఎక్కువగా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తుంటాడు. అందులో భాగంగానే ఈ కామెంట్లు చేశాడు. వండర్‌ ల్యాండ్‌లో జరిగి కేజే ఏసుదాసు ట్రిబ్యూట్‌ కార్యక్రమంలో పాల్గొన్న అలెగ్జాండర్‌ బాబు లెజెండరీ సింగర్‌లు ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల మీద కూడా కామెంట్లు చేశాడు. అయిత వారి విషయంలో సున్నితంగా కామెంట్ చేసి, బాలయ్య విషయంలో మాత్రం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య చేసే డ్యాన్స్‌ చూస్తే మిడ్‌ నైట్‌ మసాలా హీరోయిన్లు కూడా పారిపోతారంటూ కామెంట్ చేశాడు అలెగ్జాండర్‌ బాబు. Also Read: అలెగ్జాండర్‌ మాటల దాడి అక్కడితో ఆగిపోలేదు. బాలయ్య డ్యాన్స్‌ మాస్టర్లు చెప్పిన స్టెప్పులు వేయకుండా తనకు నచ్చినట్టుగా డ్యాన్స్‌ చేసి హీరోయిన్లను బెంబేలెత్తిస్తుంటాడని అన్నాడు. అంతేకాదు ఈ షోలో బాలయ్య డ్యాన్స్‌ చేసిన ఓ పాటను కూడా అవమానకరంగా పాడాడు. దీంతో సోషల్ మీడియా వేదిక బాలయ్య అభిమానులు తమ కోపాన్ని చూపిస్తున్నారు. Also Read: స్టాండప్‌ కమెడియన్లు స్టార్‌ హీరోలను టార్గెట్‌ చేయటం ఇదే తొలిసారి కాదు. గతంలో మనోజ్‌ ప్రభాకర్‌ అనే తమిళ కమెడియన్‌ మహేష్ బాబు డ్యాన్స్‌లు యాక్టింగ్‌ స్కిల్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డైరెక్టర్లు ఎంత వేడుకున్న మహేష్ ముఖంలో ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ కూడా పలకదన్నాడు మనోజ్‌. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సూపర్‌ స్టార్‌ అభిమానులు మనోజ్‌పై సోషల్ మీడియా వేదిక దాడి చేశారు. దీంతో దిగివచ్చిన మనోజ్‌ ప్రభాకర్‌ మహేష్ బాబుకు, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. Also Read:


By November 08, 2019 at 08:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stand-up-comedian-alexander-babu-sensational-comments-on-hero-balakrishna/articleshow/71964222.cms

No comments