టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు... అత్తకోడలు దుర్మరణం

శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖ నగరానికి చెందిన రమ(56) భర్త చాలా కాలం కిందటే చనిపోయారు. కొత్తపేట ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే ఆమె కుమారుడు సంతోష్‌తో కలిసి కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసముంటోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సంతోష్‌కు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మల్కాపురానికి చెందిన హిమజ(24)తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. Also Read: రమ తన డ్రైవింగ్ లైసెన్సు పునరుద్ధరణ కోసం శనివారం మధ్యాహ్నం కోడలు హిమజతో కలిసి స్కూటీపై ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయానికి బయలుదేరారు. నాగార్జుసాగర్ రహదారిపై రాగన్నగూడ సమీపంలోని వేగంగా వస్తున్న టిప్పర్ వీరి స్కూటీ ఢీకొంది. రోడ్డుపై పడిన ఇద్దరి తలలపై టిప్పర్ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్కూటీ నడుపుతున్న రమ హెల్మెట్ పెట్టుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆదిభట్ల సీఐ నరేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద తీరుపై వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకేసారి తల్లి, భార్యను పోగొట్టుకున్న సంతోష్ రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. Also Read: Also Read:
By November 24, 2019 at 12:28PM
No comments