అనుమానంతో భార్య కాళ్లు నరికేసిన భర్త.. చిత్తూరు జిల్లాలో దారుణం

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె కాళ్లు, చేతులు నరికేశాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు వైద్యం చేస్తున్నారు. Also Read: గంగాధర నెల్లూరు మండలం ఆరుమాకులపల్లి గ్రామానికి చెందిన సతీష్‌కు నాగమ్మ అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సతీశ్ భార్యను అనుమానంతో చూసేశాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. దీంతో చాలారోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినా వివాదం సద్దుమణగలేదు. Also Read: ఈ క్రమంలో ఆదివారం సతీశ్ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన అతడు కత్తితో భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు, బంధువులు వెంటనే ఆమె ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న గంగాధర నెల్లూరు పోలీసులు సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:
By November 24, 2019 at 11:44AM
No comments