వరంగల్ నిట్‌లో గంజాయి కలకలం.. 11 మంది స్టూడెంట్‌పై వేటు
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు గంజాయి మత్తులో మునిగితేలుతున్నారు. పవిత్రంగా భావించాల్సిన విద్యాలయంలో గంజాయి తాగుతూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. వరంగల్ నిట్‌లో వెలుగుచూసి గంజాయి ఉదంతం రాష్ట్రంలోని విద్యాలయాలను ఉలిక్కిపడేలా చేసింది. డ్రగ్స్ సరఫరాదారులు విద్యార్థులను టార్గెట్ చేసుకున్నట్లు ఈ ఉదంతం ద్వారా మరోసారి వెల్లడైంది. నిట్‌లో గంజాయి తాగుతూ పట్టుబడిన 11 మంది విద్యార్థులను యాజమాన్యం తాజాగా సస్పెండ్ చేసింది. Also Read: నిట్‌లో విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు వార్తలు రావడంతో అక్టోబర్ 27న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ గదుల్లో తనిఖీలు చేపట్టారు. ఆ సందర్భంగా ఫస్టియర్ విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డీన్ నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. దీనిపై విచారించిన కమిటీ 11 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారించి నివేదిక సమర్పించింది. Also Read: ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నిట్ అధికారులు అందుకు బాధ్యులైన 11 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన 11మందిలో తొమ్మిది మంది విదేశీ విద్యార్ధులే ఉన్నారు. నిట్ క్యాంపస్‌లో విదేశాలకు చెందిన విద్యార్ధులకు 1.8కే నెంబర్ హాస్టల్ కేటాయిస్తారు. ఈ హాస్టల్‌లోనే వారంతా గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. Also Read:
By November 24, 2019 at 08:14AM
No comments