Breaking News

‘మహర్షి’ ప్రమోషన్స్‌లో జగ్గుభాయ్ ఎక్కడ?!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ని ఎపిక్‌ మూవీగా పేర్కొంటున్నారు. కానీ నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినా మహేషే సొంతంగా రంగంలోకి దిగి ఎగ్రెసివ్‌గా ప్రమోషన్స్‌ చేస్తూ భారీ కలెక్షన్లు వచ్చేందుకు నడుం బిగించాడు. ఇక ఈ చిత్రం విజయోత్సవ సభ విజయవాడలో జరిగిన సందర్భంగా యూనిట్‌ అందరు హాజరయ్యారు. కానీ మెయిన్‌ విలన్‌గా నటించిన జగ్గూభాయ్‌ అలియాస్‌ జగపతిబాబు మాత్రం ఈ వేడుకకు రాలేదు. 

అదే ఆయన ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రమోషన్స్‌లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. విజయవాడ విజయోత్సవ సభలోనే కాదు.. ‘మహర్షి’ ప్రమోషన్స్‌లో మొదట నుంచి జెబి అంటీ ముట్టనట్లే ఉన్నాడు. దానికి కారణాలు ఏమిటి? అనే చర్చ సాగుతోంది. జగపతిబాబు ఊపిరి సలపని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని, అందుకే సమయాభావం వల్ల ఆయన ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నాడనే మాట వినిపిస్తున్నా... మరీ ఒకరోజు కూడా తాను నటించిన, అందునా తమ హీరోకి ప్రతిష్టాత్మక చిత్రమైన ‘మహర్షి’ని జగ్గూభాయ్‌ పట్టించుకోకపోవడం వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే చర్చసాగుతోంది. 



By May 22, 2019 at 06:44AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46035/jagapathi-babu.html

No comments