Breaking News

ఒకరి కోసం ఒకరు.. ఒకరుపోతే మరొకరు


విశాల్‌ శైలేష్‌ జైన్‌, హేమలతారెడ్డి జంటగా వి.ఎస్‌.ఫణీంద్ర దర్శకత్వంలో శుక్రన్‌ ప్రొడక్షన్‌ నం.3 చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో ప్రారంభమైంది. సంజీవ్‌కుమార్‌ నిర్మాత. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి ఆర్టిస్ట్‌ సత్య ప్రకాష్‌ క్లాప్‌నిచ్చారు. చిత్రం బాషా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఒకరి కోసం ఒకరు అనుకునే ప్రేమలో ఒకరుపోతే మరొకరు అన్న పరిస్థితి ఎందుకు కలుగుతుంది అన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. చక్కని ప్రేమకథతోపాటు సందేశమూ ఉంది. విశాల్‌కు, హేమలతకు మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుంది’’ అని అన్నారు. 

నిర్మాత సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు చెప్పిన కథ బావుంది. అందుకే ఈ సినిమా చేస్తున్నా. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అని అన్నారు. 

‘నిన్ను చూస్తే’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. నా పుట్టినరోజున ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది.. అని హీరోయిన్‌ హేమలతా చెప్పారు. 

ఈ చిత్రానికి కెమెరా: అలీ, ఎడిటర్‌: రామారావు.  



By November 01, 2018 at 03:16PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43291/shukraan-production-no-3.html

No comments