Breaking News

అమెరికా అధ్యక్షుడి వేతనం.. ఆయన నివాసం విస్తీర్ణం ఎంతో తెలుసా?


అమెరికాకు అధ్యక్షుడు కావడం గొప్ప విషయమే కాదు, వారికి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వేతనం కింద నెలకు 400,000 మిలియన్ డాలర్లతోపాటు ప్రత్యేక నివాసం, వ్యక్తిగత విమానం ఉంటాయి. మొత్తం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే విలాసవంతమైన రాజప్రసాదంలో అమెరికా అధ్యక్షుడు నివాసం ఉంటారు. ఇందులో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు, 28 ఫైర్‌ప్లేస్‌లు, టెన్నిస్ కోర్ట్, ఫ్యామిలీ మూవీ థియేటర్, జాగింగ్ ట్రాక్, స్మిమింగ్ పూల్ ఉంటాయి. ఐదుగురు చీఫ్ చెఫ్‌లు, సోషల్ సెక్రెటరీ, చీఫ్ కాలీగ్రాఫర్, ఫ్లోరిస్ట్, వాలెట్స్, బట్లర్స్ ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. ఇక, అధ్యక్షుడి అధికార గెస్ట్‌హౌస్.. వైట్‌హౌస్ కంటే 70వేల చదరపు అడుగుల పెద్దది. ఇందులో అతిథులు, సిబ్బంది కోసం 20 బెడ్‌రూమ్‌లు సహా 139 గదులు, 35 బాత్‌రూమ్‌లు, నాలుగు డైనింగ్ హాల్స్, జిమ్, ఫ్లవర్ షాప్, హెయిర్ సెలూన్ ఉంటాయి. మ్యారీలాండ్‌లో 128 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎస్టేట్‌ను 1935లో ఏర్పాటు చేశారు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సహా ప్రతి అధ్యక్షుడు దీనిని ఉపయోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనలకు అత్యాధునిక విమానం ఎయిర్‌ఫోర్స్ ఒన్, మెరైన్ ఒన్, ఒకే రకమైన ఐదు హెలికాప్టర్లు ఉంటాయి. ఇంజిన్ విఫలమైనప్పటికీ ఇవి గంటకు 150 మైళ్ల పైగా రెస్క్యూ మిషన్లు, క్రూయిజ్లను ఆపరేట్ చేయగలదు. ఇది యాంటీ-క్షిపణి వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంటాయి. ప్రెసిడెంట్ కారు ‘లిమోసిన్’ ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. రసాయన దాడి జరిగినప్పుడు ఎటువంటి ముప్పు లేకుండా తలుపులు ఆయుధ-పూతతో ఉంటాయి. దీని అద్దాలు ఐదు పొరల గాజు, పాలికార్బోనేట్‌తో ఉంటాయి. ఈ కారులో ఆక్సిజన్ సరఫరా, అగ్నిమాపక వ్యవస్థ, బ్లడ్ బ్యాంక్ కూడా ఉన్నాయి. సీక్రెట్ సర్వీస్ అధ్యక్షుడు, అతడి కుటుంబానికి 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ నిరంతరాయం భద్రత కల్పిస్తుంది. పన్నుల సహిత వేతనం 4,00,000 డాలర్లు, వినోద అలవెన్సు 19,000 డాలర్లు, ఇతర అలవెన్సుల కింద అదనంగా ఏడాదికి 50,000 డాలర్లు, ట్రావెల్ అలవెన్సు 100,000 డాలర్లు చెల్లిస్తారు.


By November 08, 2020 at 01:03PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-salary-financial-perks-of-being-the-president-of-the-united-states/articleshow/79110401.cms

No comments