Breaking News

భార్య బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. భర్త నీచం


భార్య బాత్రూమ్‌లో ఉండగా సీక్రెట్ కెమెరాలతో ఫొటోలు తీసి నీచానికి ఒడిగట్టాడో భర్త. అభ్యంతరకర రీతిలో ఉన్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దిక్కుతోచని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది. లుధియానాకి చెందిన యువతి(23) అసభ్యకర ఫొటోలు తీసి తన భర్త బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టాడని.. తాను బాత్రూమ్‌లో ఉండగా ఫొటోలు తీసి బెదిరిస్తున్నాడని వాపోయింది. ఫొటోలు బయటపెట్టకుండా ఉండేందుకు రూ.20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. లేకుంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు తన వాట్సాప్ స్టేటస్‌లో ఆ ఫొటోలు పెట్టాడని ఆమె వాపోయింది. తన అత్తమామల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై ఐటీ యాక్ట్‌లోని 67, 67 ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. Also Read:


By November 08, 2020 at 11:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-captures-obscene-photos-of-wife-in-bathroom-blackmails-her/articleshow/79109735.cms

No comments