Breaking News

అర్ణబ్‌‌కు హైకోర్టు షాక్.. బెయిల్ పిటీషన్‌ తిరస్కరణ


రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన బెయిల్ మీద విడుదల అవుతారు అనికున్నారు. కానీ బాంబే హైకోర్టులో అర్నాబ్ బెయిల్ పిటీషన్ కు చుక్కెదురైంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నెల 18 వరకు అర్నాబ్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అర్నాబ్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో తన వాదనలు వినిపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అర్నాబ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ భార్య అక్షతలను తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ వాయిదా వేసింది. ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్య కేసును బాధిత కుటుంబం అభ్యర్థనపై మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేసిన కేసును రీఓపెన్ చేసింది. Read More: దీంతో అర్నాబ్ గోస్వామి, ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను అరెస్ట్ చేసి అలీబాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అర్నాబ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమేత అనుమతించింది. ప్రస్తుతం అర్ణబ్ గోస్వామి అలీబాగ్ జైలు కోసం ఏర్పాటు చేసిన ఓ కొవిడ్ కేంద్రంలో ఉన్నారు.


By November 06, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arnab-goswami-failed-to-get-interim-relief-from-the-bombay-high-court/articleshow/79073273.cms

No comments