Breaking News

ఇద్దరితో ప్రేమాయణం.. గాజువాక యువతి హత్య కేసులో కొత్త ట్విస్ట్


విశాఖ గాజువాకలో నిన్న సాయంత్రం హత్యకు గురైన యువతి వరలక్ష్మీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి హత్యకు ఇద్దరితో సాన్నిహిత్యమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. వరలక్ష్మీ హత్య చేసిన వెంటనే నిందితుడు అఖిల్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పరారీలో ఉన్న మరో యువకుడు రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించరు. దీంతో వరలక్ష్మీ ఇద్దరితో కూడా సాన్నిహిత్యంగా ఉన్నట్లు విచారణలో వెల్లడించాడు. ఓవైపు అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటూనే.. మరో వైపు రాముతో ప్రేమాయణం సాగించినట్లు తెలిసింది. దీంతో ఆ విషయం కోసం మాట్లాడేందుకు అఖిల్, రాముతో కలిసి వరలక్ష్మీని సాయిబాబా గుడి వద్దకు రావాలన్నారు. అక్కడకు వచ్చిన యువతితో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ముగ్గురు కూడా ఈ వ్యవహారంలో మాట్లాడుకున్నారు. దీంతో కోపం తట్టుకోలేక అఖిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో వరలక్ష్మి గొంతుకోశాడు. రాముతో సాన్నిహిత్యంగా ఉండటం తట్టుకోలేకే.. అఖిల్ సాయి ఆమెను హత్య చేశాడు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. Read More: ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఏపీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రేమోన్మాద దాడులతో జనం భయాందోళనలకు గురి చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయవాడలో దివ్య తేజస్విని అనే యువతిని కూడా ప్రియుడు నాగేందర్ కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే విశాఖలో మరో ప్రేమోన్మాది దాడి జరగడం కలకలం రేపుతోంది. మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న... దాడులు, హత్యలు మాత్రం ఆగడం లేదు.


By November 01, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/new-twist-in-visakhapatnam-gajuwaka-girl-murder-case/articleshow/78978253.cms

No comments