chittoor: ప్రియురాలికి పెళ్లై మూడు రోజులు.. తట్టుకోలేని ప్రియుడు.!

ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లైపోయింది. అదే తలచుకుంటూ బాధపడుతున్న ప్రియుడు మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర మనస్థాపంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన జిల్లా మదనపల్లెలో జరిగింది. పట్టణ శివారులోని చంద్రాకాలనీకి చెందిన సలీం కుమారుడు కరీముల్లా(21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొద్దకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు మూడురోజుల కిందట మరో యువకుడితో వివాహం జరిగింది. ప్రియురాలు తనకు దక్కలేదన్న బాధతో కుంగిపోయి కరీముల్లా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేయికోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు పోలీసులు విచారిస్తున్నారు. Also Read:
By October 31, 2020 at 10:29AM
No comments