Breaking News

పరాయి వ్యక్తితో భార్య పడక సుఖం.! అనుమానంతో అత్తనీ వదలని అల్లుడు


భార్య మరొకరితో పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. అమానుషంగా గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆమెకు సహకరిస్తోందన్న కోపంతో అత్తని కూడా చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. చాంద్లాయ్ రోడ్ శివం కాలనీకి చెందిన మంజు సైనీతో రామ్‌కిషన్ సైనీకి వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు సంతానం. ఇల్లరికం వచ్చిన రామ్‌కిషన్ సైనీ అత్తారింట్లోనే ఉండేవాడు. భర్త రామ్‌కిషన్ కొద్దికాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో పెట్టుకుందని అనుమానించేవాడు. భార్య రాసలీలలకు అత్త సహకరిస్తోందని కోపం పెంచుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లని దారుణంగా చంపేశాడు. భార్య, అత్త గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తన పిల్లలను తీసుకుని నేరుగా చక్సు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. Also Read: అక్రమ సంబంధం పెట్టుకుందని తన భార్య, ఆమెకు సహకరిస్తున్న అత్తని చంపేశానని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇంటికి వెళ్లి చూడడంతో రక్తపు మడుగులో పడి ఉన్న మంజు సైనీ, అత్త గైరా దేవి మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. శివ్‌దాస్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నానని తనను చంపేందుకు కుట్ర పన్నారని.. అందుకే అత్త, భార్యని చంపినట్లు నిందితుడు చెప్పడం గమనార్హం. Read Also:


By September 15, 2020 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-her-mother-over-illicit-affair-in-jaipur/articleshow/78119324.cms

No comments