Breaking News

Balakrishna: పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ.. నాగబాబు బయటపెట్టిన రహస్యం! ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్


ఇన్ని రోజులు బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ సంచలన కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి బాలయ్య బాబు షేక్ హ్యాండ్ ఇస్తున్న పిక్ షేర్ చేస్తూ రహస్యం బయటపెట్టారు. ఆ పిక్ తాలూకు వివరాలు తెలియజేస్తూ నాగబాబు పెట్టిన కామెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్. దీంతో ఈ ఫోటోతో పాటు నాగబాబు లేవనెత్తిన ఇష్యూ నెట్టింట వైరల్ కావడమే గాక చర్చల్లో నిలిచింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా , ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పిక్ అభిమానుల ముందుంచుతూ ''2 బ్రదర్స్ కమ్ టుగెదర్.. ఒకరు సొంత తమ్ముడు మరొకరు బ్రదర్ ఫ్రమ్ అనెదర్ మదర్'' అని ఆసక్తికర కామెంట్ జత చేశారు నాగబాబు. ఇంకా తనవద్ద ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయని, ఇది జస్ట్ ‌శాంపిల్ మాత్రమే. మనం పెట్టే పిక్స్‌కి గ్యాలరీ నిండి పోవాల్సిందే అన్నారు మెగా బ్రదర్. దీంతో ఇన్నాళ్లు బాలయ్య ఎవరో కూడా తెలియదంటూ ఆయనపై నిప్పులు చెరిగిన నాగబాబు.. ఒక్కసారిగా ఇలా బాలకృష్ణను బ్రదర్ అని ప్రస్తావించడం వెనుక కారణాలేమై ఉంటాయనేది మెగా, నందమూరి వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. Also Read: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అనుమతుల విషయంమై చిరంజీవి, నాగార్జున సహా సినీ పెద్దలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవగా.. ఆ కార్యక్రమాన్ని తనను పిలవకపోవడంపై ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఈ ఇష్యూలో నాగబాబు సైతం బాలయ్యపై మండిపడ్డారు. దీంతో మెగా, నందమూరి వర్గాల నడుమ వార్ ముదిరింది. సోషల్ మీడియాలో ఇరువురి ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఫైట్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో నాగబాబు షేర్ చేసిన ఈ పిక్ ఆసక్తికరంగా మారింది. ఇది చూసి ఇరు వర్గాల ఫ్యాన్స్ షాకయ్యారు. వారి నుండి దీనిపై మిశ్రమ స్పందన వస్తుండటం విశేషం. Also Read: ఇక నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో విషయానికొస్తే.. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'సుస్వాగతం' సినిమా లాంచ్ అయిన రోజు పవన్‌ని బాలకృష్ణ విష్ చేస్తున్న పిక్ ఇది. ఆ రోజు బాలయ్యతో పాటు పవన్‌ని విష్ చేయడానికి చాలామంది హీరోలు వచ్చారు. చాలా కాలం తరువాత మళ్ళీ ఆ స్పెషల్ ఫోటోను నాగబాబు పోస్ట్ చేయడం, దానిపై 2 బ్రదర్స్ అని కామెంట్ చేయడం అందరినీ తెగ ఆకర్షించింది.


By September 15, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-intresting-comments-on-balakrishna-pawan-kalyan-viral-photo/articleshow/78117873.cms

No comments