Breaking News

ఘోరం.. గర్భిణి కడుపులో తన్నడంతో బయటకొచ్చిన బిడ్డ.. 7 నెలలకే..


అప్పు తీర్చలేదన్న కోపంతో బిడ్డ బయటికొచ్చేలా గర్భిణి కడుపులో తన్నిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఘజియాబాద్‌ జిల్లా గుక్నా గ్రామానికి చెందిన సంజయ్ వర్మ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. తన భార్య బంగారం తాకట్టు పెట్టి పక్కింటి వ్యక్తుల వద్ద రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దికాలంగా అప్పు తిరిగి చెల్లించమని వారి నుంచి ఒత్తిడి మొదలైంది. కోవిడ్ కారణంగా కంపెనీ జీతాల్లో కోత విధించడంతో వర్మ అప్పు కట్టలేకపోయాడు. కొంత సమయం కావాలని అడిగినా ఒప్పుకోని వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చలేదన్న కోపంతో దారుణానికి పాల్పడ్డారు. ఏడుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వర్మని చావబాదారు అడ్డొచ్చిన అతని భార్యపైనా దాడికి దిగారు. గర్భంతో ఉందన్న కనీస కనికరం లేకుండా కడుపులో తన్నడంతో ఆమె తల్లడిల్లిపోయింది. నొప్పులతో బాధపడుతుండడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో నెలలు నిండని శిశువు బయటికొచ్చింది. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. Also Read: దీంతో ఆగ్రహం చెందిన వర్మ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. ఏడు నెలల గర్భిణి కడుపులో తన్ని శిశువు మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్టు చేయకపోవడం గమనార్హం. చలాన్‌తో సరిపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. శిశువు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. Read Also:


By September 15, 2020 at 11:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-delivers-stillborn-after-neighbours-kick-her-in-abdomen-in-ghaziabad/articleshow/78120453.cms

No comments