Breaking News

Telangana: ‘అలుగు’ విక్రయ ముఠా గుట్టురట్టు.. 12 మంది వేటగాళ్లు అరెస్ట్


ఆసిఫాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేటాడి చంపుతున్న వేటగాళ్ల ముఠాను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. టెక్నాలజీ సాయంతో వన్యప్రాణులను వేటాడి దేశవిదేశాల్లో విక్రయిస్తున్న ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న సిర్పూర్(టి) రేంజ్ ఫారెస్ట్ అధికారులు వ్యూహాత్మకంగా వారి ఆట కట్టించారు. ముఠా సభ్యుల ఫోన్ నంబర్ సేకరించిన అధికారులు ఓ వన్యప్రాణి(అలుగు) కావాలంటూ వారితో బేరసారాలు చేశారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం మందమర్రికి చెందిన వ్యక్తి కారులో అలుగును తెస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. Also Read: అతడిచ్చిన సమాచారంతో మందమర్రికి చెందిన ముగ్గురు, కాగజ్‌నగర్‌కు చెందిన ఇద్దరు, జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌(యు) గ్రామాలకు చెందిన మరికొందరితో కలిపి మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి(అలుగు)ని కాగజ్‌నగర్‌ ఫారెస్ట్ డివిజన్‌ కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. దాని కాలికి గాయం కావడంతో వెటర్నరీ డాక్టర్‌తో చికిత్స అందించారు. గతంలో ఎన్నో జంతువుల శరీర భాగాలను విక్రయించే ముఠాలను అరెస్ట్ చేసినా... అలుగు విక్రయ ముఠాను పట్టుకోవడం ఇదే తొలిసారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. Also Read: ఈ ముఠా సభ్యులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు చెన్నై, నేపాల్‌, చైనా దేశాలకు వన్య ప్రాణులను తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన సూత్రధారులు ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలియడంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. Also Read:


By August 31, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wildlife-animals-hunters-gang-arrested-in-telangana/articleshow/77844187.cms

No comments