Breaking News

Hyderabad: నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్


హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితుల సాయంతో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: మహ్మద్‌గూడకు చెందిన బాలిక(14)కు సీతాఫల్‌మండి బీదల బస్తీకి చెందిన శివకుమార్‌ (23)తో కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది. బాలికను అనేకసార్లు బయటికి తీసుకెళ్లిన శివకుమార్ ఆమె నగ్నచిత్రాలను తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకుని ఏడాదిగా ఆమెను వేధిస్తున్నాడు. వారం రోజుల క్రితం శివకుమార్‌తో పాటు అతడి ముగ్గురు స్నేహితులు బాలిక బెదిరించారు. తాము చెప్పిన చోటికి వస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేసేస్తామని నమ్మించారు. Also Read: ఆ మాటలు నమ్మిన బాలిక వారి వెంట ఓయూ పరిధిలోని ఓ పాత భవనానికి వెళ్లింది. అక్కడ నలుగురు కామాంధులు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తర్వాతి రోజు బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఏం జరిగిందని కుటుంబసభ్యులు అడగ్గా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు రెండ్రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు. Also Read:


By August 27, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-gang-raped-by-4-men-in-hyderbad-accused-arrested/articleshow/77775586.cms

No comments