Breaking News

భర్తపై అలిగి వెళ్లిపోయిన మహిళ.. మూడ్రోజుల తర్వాత కుంటలో శవమై


కుటుంబ కలహాలతో భర్తపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళ మూడ్రోజుల తర్వాత కుంటలో శవమై కనిపించిన విషాద ఘటన జిల్లాలో జరిగింది. మండలం అడవిషేక్‌ తండాకు చెందిన కవిత(40)కు నవాబుపేట మండలం రాంసింగ్‌ తండాకు చెందిన రమేశ్‌నాయక్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు(2) ఉన్నారు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే 21వ తేదీ(శుక్రవారం) భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో కవిత అలిగి సాయంత్రం వేళ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు చుట్టు పక్కల గాలించగా తండా పక్కన ఉన్న కుంటలో ఆదివారం విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తూ స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే తమ కూతురి చావుకు అత్తింటివారే కారణమని కవిత తల్లి శాలిబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 24, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-mahabubnagar-district-relatives-allegations-on-husband/articleshow/77712864.cms

No comments