Breaking News

మహిళా పోలీసుతో ఎస్ఐ శారీరక సంబంధం.. పెళ్లయ్యాక అసలు ట్విస్ట్


ప్రజలకు రక్షణ కల్పించే ఉద్యోగంలో ఉన్న పోలీసే మోసగాడిగా మారాడు. తనతో పనిచేసే మహిళా ఎస్ఐని శారీరకంగా లొంగదీసుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పరారయ్యాడు. భర్త ఎక్కడున్నాడో తెలియక బాధితురాలు తల్లడిల్లుతోంది. అతడి చేతిలో మోసపోయానని తెలిసి న్యాయం చేయాలంటూ డీజీపీని ఆశ్రయించింది. ఈ ఘటన ఒడిశాలోని వెలుగుచూసింది. Also Read: గంజాం జిల్లా కళ్లికోట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న సిల్లూధాల అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు ఓ మహిళా ఎస్ఐ సోమవారం భువనేశ్వర్‌లోని డీపీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2017లో భువనేశ్వర్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతుండగా సిల్లూధాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన సిల్లూధాల మాయమాటలతో మభ్యపెట్టి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా నిరాకరించాడు. దీంతో దారింగిబాడి పీఎస్‌లో 2019లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. Also Read: దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిల్లూధాల అంగీకరించాడు. ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కాపురం చేశాక మాయమయ్యాడు. 10 నెలలుగా అతడు కనిపించడం లేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని బాధితురాలు చెబుతోంది. మోసగాడైన సిల్లూధాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డీజీపీని వేడుకుంది. Also Read:


By August 25, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sub-inspector-cheating-lady-si-for-pretext-on-marriage-in-odisha-victim-complaints-to-dgp/articleshow/77733779.cms

No comments