Breaking News

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడికి పోలీసుల షాక్


పశ్చిమ బెంగాల్ నుంచి యువతులకు అక్రమంగా తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర ప్రాంతానికి చెందిన వంశీరెడ్డి అలియాస్‌ కృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం వ్యభిచార నిర్వాహకురాలు అంజలితో పరిచయమైంది. సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న వంశీరెడ్డి ఆమె ముఠాలో సభ్యుడిగా చేరాడు. Also Read: ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్‌లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగిపోయేది. Also Read: దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసుల కొద్దిరోజుల క్రితం వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. Also Read:


By August 25, 2020 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-rachakonda-police-opens-pd-act-on-prostitution-racket-owner/articleshow/77733647.cms

No comments