Breaking News

‘అర్థమైంది జక్కన్నా’.. RRR వీడియో ఆలస్యంపై చిరు రియాక్షన్


తమ అభిమాన హీరోకి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూసిన సందర్భాలు చూస్తూ ఉంటాం.. కాని తమకు సంబంధించిన స్పెషల్ వీడియో కోసం ఎదురుచూసుకుని క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి కల్పించారు దర్శకధీరుడు జక్కన్న. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, హీరోలుగా ‘RRR’ చిత్రాన్ని చెక్కుతూ ఉన్నారు దర్శకధీరుడు . ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నారు. అయితే నేడు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే కావడంతో అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. నేటి ఉదయం 10 గంటలకు బర్త్ డే గిఫ్ట్‌గా రామరాజు స్పెషల్ వీడియోను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. Read Also: అయితే ఉదయం నుండి ఈ వీడియో కోసం కళ్లు కాయలు కాచేలా కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నా.. వీడియో మాత్రం విడుదల చేయలేకపోయింది చిత్ర యూనిట్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలే అయ్యింది. అయితే సాధారణ ప్రేక్షకుల మాదిరే ఈ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఎదురుచూశారు. అయితే ఎప్పటికీ వీడియో విడుదల కాలేకపోవడంతో ఎన్టీఆర్ రామ్ చరణ్‌కి సారీ చెప్తూ ‘బ్రదర్ రామ్ చరణ్.. నీ గిఫ్ట్‌ని జక్కన్నకు లాస్ట్ నైట్ పంపించా.. అందువల్లే ఆలస్యం అవుతుంది.. అయితే ఆయన సాయంత్రం 4 గంటలకు తప్పకుండా విడుదల చేద్దాం అంటున్నారు’ అని ట్వీట్ చేశారు. Read Also: దీనిపై స్పందించిన రామ్ చరణ్.. ‘వాట్.. ఆయనకు పంపించావా?? ఈరోజుకు వస్తుందా?’ అంటూ ప్రేక్షకుల మదిలో మాటనే ఆయన మాటగా అనేశారు. రామ్ చరణ్.. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం.. ఐయామ్ వెయిటింగ్ అంటూ ఖైదీ నెం.150 స్టిల్‌ను షేర్ చేసి.. తొందరగా విడుదల చేయండి.. వెయిట్ చేస్తున్నా అన్నట్టుగా పోస్ట్ చేశారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. ‘సార్ అంటే.. అది కొంచెం.. ప్లీజ్ సార్’ అని నసుకుతూ ట్వీట్ చేయడంతో.. ‘అర్థమైంది జక్కన్న గారూ’ అంటూ రాజమౌళి బాధను అర్థం చేసుకుంటూ ట్వీట్ పెట్టారు చిరంజీవి. మొత్తానికి అనుకున్న టైంకి ఈ వీడియోను రిలీజ్ చేసిన ఇంత చర్చ నడిచి ఉండేది కాదేమో.. ఎంతైనా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళికి అన్నీ ఇలా కలిసి వచ్చేస్తుంటాయి అంటూ సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి. Read Also:


By March 27, 2020 at 12:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-star-chiranjeevi-shocking-reaction-on-ram-charan-rrr-ramaraju-video-delay/articleshow/74843014.cms

No comments