హోటల్‌లో పనిచేసే బాలికపై యజమాని రేప్... గర్భం దాల్చిన బాధితురాలు

నగర శివారు శంషాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలికను పనిలో పెట్టుకున్న హోటల్ యజమాని ఆమెను లొంగదీసుకుని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన దంపతులు బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం పిల్లలతో కలిసి శంషాబాద్‌కు వచ్చారు. తొండుపల్లిలోని ఓ హోటల్‌లో కొంతకాలంగా తల్లితో పాటు ఆమె కూతురు(16) కూడా పని చేస్తోంది. Also Read: బాలికపై కన్నేసిన హోటల్ యజమానికి ఆమె ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని చనువు పెంచుకున్నాడు. ఆమెకు అప్పుడప్పుడూ వస్తువులు కొనిస్తూ లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి లేని సమయంలో హోటల్‌లోని ఓ గదిలోకి ఆమెను తీసుకెళ్లి అనేకసార్ల లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండే మంచి మంచి వస్తువులు కొనిస్తానని నమ్మబలికేవాడు. దీంతో బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. Also Read: ఇటీవల బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆమె మూడు నెలలు గర్భవతి అని డాక్టర్లు చెప్పడంతో షాకయ్యారు. దీంతో తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా హోటల్ యజమాని తనపై సాగిస్తున్న కీచకపర్వాన్ని వెల్లడించింది. దీంతో వారు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ కామాంధుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By March 28, 2020 at 07:33AM
No comments