Breaking News

పెళ్లయిన వారానికి యువతి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు


ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మోహన సమితి చంద్రగిరి హఠొపొదవీధిలో వారం రోజుల క్రితమే వివాహం చేసుకున్న నవవధువు మంగళవారం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గజపతి జిల్లా కొందొ అడవకు చెందిన పంకజనాయక్‌(21), గంజాం జిల్లా అస్కా ప్రాంతానికి చెందిన సమీర్‌జెన్నా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితమే వివాహం చేసుకుని చంద్రగిరి హఠొపొదవీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజే భర్త వేధిస్తున్నాడంటూ చంద్రగిరి ఔట్‌పోస్టులో పంకజనాయక్‌ రెండ్రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. Also Read: భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీర్‌ పరారయ్యాడు. మంగళవారం పంకజనాయక్‌ ఇంటిలోనుంచి పొగలు వస్తున్నాయని ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు విరగగొట్టి చూడగా బాధితురాలు అప్పటికే నిప్పంటించుకుని దేహమంతా కాలి మరణించింది. ఇంట్లో దొరికిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త పెడుతున్న చిత్రహింసల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 25, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-commits-suicide-in-odisha/articleshow/74805062.cms

No comments