Breaking News

ఇటలీలో కరోనా మరణ మృదంగం.. డాక్టర్లను పంపించిన క్యూబా


ప్రభావం తీవ్రంగా ఉన్న దేశం . కోవిడ్ కేసులు నానాటికీ తీవ్రంగా పెరిగిపోతుండటంతో.. ఆ దేశం విలవిల్లాడిపోతోంది. కరోనాను కట్టడి చేయడం కోసం ఆ దేశంలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు. ఇటలీలోని వేలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ను అదుపు చేయడం ఇటలీకి తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఆ దేశం సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. ఇటలీని ఆదుకునేందుకు క్యూబా డాక్టర్ల బృందాన్ని ఆ దేశానికి పంపింది. ఇలాంటి రోగాలు ప్రబలిన సమయంలో సాటి దేశాలను ఆదుకోవడంలో క్యూబా ముందు వరుసలో నిలుస్తోంది. హైతీలో కలరా సోకినప్పుడు, పశ్చిమాసియాలో ఎబోలా ప్రబలినప్పుడు.. ఆ దేశం వైద్య బృందాలను పంపి సాయం చేసింది. ఇటలీలోని లొంబార్డీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో... ఇక్కడికి క్యూబా తన డాక్టర్లను పంపింది. 1960 నుంచి క్యూబాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటలీ సాయం కోరగానే చైనా స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని, అవసరమైన మందులను పంపించింది. రష్యా కూడా డాక్టర్ల బృందాన్ని, మందులను పంపిస్తోంది. కానీ సాటి యూరోపియన్ దేశాలు సాయం చేయడానికి ముందుకు రావడం లేదని ఇటలీ వాపోతోంది. ఇటలీలో 60 వేల మంది కరోనా బారి పడగా.. 5476 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులోనే ఇటలీలో 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో... శవాలను ఖననం చేయడానికి కూడా వేచి చూడాల్సి వస్తోంది.


By March 23, 2020 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/cuba-sends-doctors-team-to-coronavirus-hard-hit-italy/articleshow/74768435.cms

No comments