Breaking News

మటన్ కర్రీ కోసం ఘర్షణ.. అన్న చేతిలో తమ్ముడి దారుణహత్య


మటన్ కూర విషయంలో తలెత్తిన వివాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన దోర్నాల మండలం కొర్రప్రోలు చెంచు గిరిజన గూడెంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో వరుసకు అన్న అయిన దాసరి గురవయ్య చేతిలో తమ్ముడు దాసరి అంకన్న(20) ప్రాణాలు కోల్పోయాడు. దాసరి పెద్ద గురవయ్య భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి అప్పటికే అంకన్న, పోతురాజు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో వివాహం చేసుకున్న మహిళకు అప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. అతని పేరు కూడా గురవయ్య. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. Also Read: ఆదివారం అందరూ ఇంట్లో ఉండటంతో మటన్ కూర వండుకున్నారు. పోతురాజు తన కంచంలో కూర ఎక్కువగా వేసుకుని బయటకు వెళ్తుండగా గురవయ్య వారించాడు. మాంసం ఎవరి కోసం తీసుకెళుతున్నావంటూ తిట్టాడు. దీంతో ఆగ్రహించిన అంకన్న, పోతురాజు ఇద్దరూ కలిసి గురవయ్యను కొట్టారు. ఆవేశంతో బయటకు వెళ్లిన గురవయ్య కత్తి తీసుకుని అంకన్నను వెనుక నుంచి గొంతులో పొడిచాడు. దీంతో అంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 23, 2020 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-kills-step-brother-after-tiff-over-mutton-curry-in-prakasam-district/articleshow/74767977.cms

No comments