Breaking News

భార్య అక్రమ సంబంధానికి భర్త బలి... నిద్రమత్తులో ఉండగా ఉరేసి


అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా చంపేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన నిందితురాలిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాకినాడ డీఎస్పీ వి.బీమారావు కథనం ప్రకారం... జి.మామిడాడ నివాసి అయిన సొంటెన రోహిణి సూర్యనారాయణ(30) ఫిబ్రవరి 14న అనుమానాస్పదంగా చనిపోయాడు. తన భర్తది సహజ మరణమని భార్య దుర్గాభవానీ పోలీసులకు చెప్పింది. అయితే సూర్యనారాయణ శరీరంపై గాయాలను గమనించిన తమ్ముడు వెంకటరమణ పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు మార్చి 18న వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సూర్యనారాయణను గొంతునులిమి చంపినట్లు తేలింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గాభవానీ మంగళవారం జి.మామిడాడ వీఆర్వో వద్దకు వెళ్లి లొంగిపోయింది. తనకు హరికృష్ణ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ వేధించేవాడని తెలిపింది. Also Read: తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఫిబ్రవరి 14న మధ్యాహ్నం భోజనంలో నిద్రమాత్రలు కలిపి కాళ్లు, చేతులు చున్నీలతో కట్టి గొంతునులిమి చంపేశానని అంగీకరించింది. ప్రియుడు హరికృష్ణ సలహా మేరకు జాగ్రత్త పడినట్లు వీఆర్వోకు వెల్లడించింది. దీంతో వీఆర్వో ఆమెను పెదపూడి పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ సీఐ మురళీకృష్ణ, పెదపూడి ఎస్సై లక్ష్మి నిందితురాలిని అరెస్టు చేశారు. మరో నిందితుడైన హరికృష్ణ కోసం గాలిస్తున్నట్లు కాకినాడ డీఎస్సీ బీమారావు తెలిపారు. Also Read:


By March 25, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-help-of-boyfriend-in-east-godavari-district/articleshow/74802976.cms

No comments