Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: 20వేలకు చేరువైన కరోనా మరణాలు.. లాక్‌డౌన్‌లోకి దేశం


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. వైరస్ వెలుగుచూసి తొలి 67 రోజుల్లో బాధితుల సంఖ్య లక్షకు చేరింది. అదే రెండో లక్షను తాకడానికి 11 రోజులు, మూడో లక్షను దాటడానికి కేవలం నాలుగు రోజులే పట్టగా, నాలుగో లక్షను రెండు రోజుల్లోనే చేరుకోవడం మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తుందనడానికి నిదర్శనం. ఇప్పటి వరకు మహమ్మారి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ఇప్పటి వరకు 550కిపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో పది మంది మృతిచెందారు. తాజాగా, తమిళనాడులో బుధవారం మరొకరు కరోనాకు బలయ్యారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. తమిళనాడుకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. జగన్ సర్కార్‌కు అసెంబ్లీ సమావేశాల రూపంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ ఈ నెల 31 వరకు ప్రకటించినా బడ్జెట్ సెషన్స్ నిర్వహించక తప్పేలా లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.. మార్చి 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు కరోనా వైరస్ భయం, మరోవైపు లాక్‌డౌన్‌తో జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి. ప్రభుత్వాలు చెప్పిన వినకుండా జనాలు రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. విధుల్లో బిజీగా ఉండే పోలీసులు.. సమాజ సేవలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో తిండి లేక రోడ్లపై ఇబ్బందిపడుతున్న అనాథలకు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయాన్ని అందిస్తున్నారు.. కొత్తగూడెంలో పోలీసు అధికారి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇతడు లండన్ నుంచి తిరిగొచ్చాడు. తాజాగా నమోదైన రెండు కేసులు సదరు పోలీసు అధికారి, వారి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న మహిళ అని తెలుస్తోంది. దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారిని కలిసిన వారిపైనే కాకుండా ప్రజలందరిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కరోనా కట్టడి కోసం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనాలంతా కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని సూచించారు.. ఈ రాకాసి వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జనాలు ఈ 21 రోజులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దేశ ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అయితే విదేశాల నుంచి వస్తున్న వాళ్లు తప్పకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు సీఎం కేసీఆర్. విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి మంగళవారం నుంచి రెడ్ నోటిసులు జారీ చేశారు అధికారులు.


By March 25, 2020 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-deaths-news-updates-in-andhra-and-telangana-across-india-and-globally-in-telugu/articleshow/74803269.cms

No comments