Breaking News

సాయి తేజ్ సింగిల్స్ డే విషెస్.. పేలుతున్న జోకులు


సాధారణంగా యవ్వనంలో ఉన్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ తమకో జోడీని వెతుక్కుంటున్నారు. కొంత మంది అయితే సహజీవనం కూడా చేస్తున్నారు. కొంత మంది ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుంటున్నారు. సినిమా హీరోలు కూడా దీనికి అతీతం కాదు. చాలా మంది పెళ్లికాని సినీ స్టార్లు తమకిష్టమైన వ్యక్తితో రిలేషన్‌షిప్‌ను మెయింటైన్ చేస్తున్నారు. కానీ, కొంత మంది ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. వాళ్లలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకరు. తనలానే సింగిల్‌గా ఉన్న వాళ్లను అప్పుడప్పుడు సాయి తేజ్ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈఏడాది వాలంటైన్స్ వీక్ ప్రారంభం అయినప్పుడు ‘‘రండి సింగిల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం’’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు తేజూ. ఇప్పుడు సింగిల్స్ డే రోజు కూడా అలాంటి ట్వీటే చేశారు. కాకపోతే, ఈసారి మాత్రం తాను చేస్తోన్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్‌లో తేజూపై జోకులు పేలుతున్నాయి. ఆయన అభిమానులే సరదాగా ఆటపట్టిస్తూ రిప్లైలు ఇస్తున్నారు. ‘‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సింగిల్ ఆర్మీ.. హ్యాపీ సింగిల్స్ డే. ఎప్పుడైనా ఎక్కడైనా సోలో బ్రతుకే సో బెటర్’’ అని తన ట్వీట్‌లో తేజూ పేర్కొన్నారు. అలాగే ‘సోలో బ్రతుకే సో బెటర్’ పోస్టర్ కూడా పొందుపరిచారు. అయితే, ఒకమ్మాయి.. ‘మరి హీరోయిన్ ఎందుకు ఉంది మూవీలో’ అని ప్రశ్నించింది. మరో మెగా ఫ్యాన్ అయితే.. ‘‘ఇప్పుడు ఇలానే అంటావన్న.. లాస్ట్‌కి నభా నటేష్‌తో ఒక రొమాంటిక్ సాంగ్ వేస్తావ్. నీ గురించి మాకు తెలీదా.. ‘జవాన్’లో పాపం మెహ్రీన్’’ అని రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ అయితే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘‘బయటకేమో సింగిల్స్ రా తోపురా, సింగిల్ లైఫ్ రా క్రేజీ రా అనుకుంటాం. లోపలేమో ఏమిటో ఒక్క పిల్ల కూడా పడట్లేదు అని బాధపడతాం’’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. ఇలా సరదా రిప్లైలు, జోకులు చాలానే ఉన్నాయి. అన్నీ పాజిటివ్‌గా నవ్వుకునే విధంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సింగిల్స్ డే మనది కాదు. చైనాలో జరుపుకుంటారు. సింగిల్‌గా ఉండే వాళ్లు ఈరోజున విపరీతంగా షాపింగ్ చేస్తారు. సింగిల్‌‌కు సూచికగా 11/11 తేదీన ఈరోజును ప్రతి ఏటా జరుపుకుంటారు.


By November 11, 2019 at 04:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-promotes-his-film-solo-bratuke-so-better-on-the-occasion-of-singles-day/articleshow/72007436.cms

No comments