Breaking News

వివాదాలకు తెర తీయనున్న `తలైవి`.. ప్రారంభమైన అమ్మ బయోపిక్‌


తమిళనాడు సినీ రంగంలో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను వెండితెర కెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయలలిత మరణం కూడా సంచలనంగా మారటతంతో అమ్మ బయోపిక్‌పై మరింత ఆసక్తి నెలకొంది. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు జయలలిత బయోపిక్‌కు తెర రూపం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్‌ మీనన్‌ అమ్మ బయోగ్రఫిని ప్రారంభించారు. వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతున్న ఈ బయోగ్రఫీలో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ అయిన ఈ వెబ్‌ సిరీస్‌కు క్వీన్ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశారు. తాజాగా అమ్మ కథతో రూపొందుతున్న బయోపిక్‌ సెట్స్‌ మీదకు వచ్చింది. Also Read: బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్‌ను తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ జయలలిత బయోపిక్‌కు కథా స్క్రీన్‌ప్లే అందించారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం (11-11-2019) చెన్నైలో ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు.. తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన నటీ నటులు నటిస్తున్నారు. జయలలిత జీవితంలో ఎంతో కీలకమైన ఎంజీ రామచంద్రన్‌ పాత్రలో సీనియర్‌ నటుడు అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. జయలలిత సినీ జీవితం నుంచి, రాజకీయ రంగ ప్రవేశం, సీయం స్థాయికి ఎదగటం చివరకు ఆమె మరణం కూడా వివాదాస్పదమే. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. సినిమాలో కంగనాను జయలలితలా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Also Read: బ్లేడ్‌ రన్నర్‌, కెప్టెన్‌ మార్వెల్‌ లాంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత మేకప్‌ ఆర్టిస్ట్‌ను ఈ సినిమాకు కోసం తీసుకువచ్చారు. కంగన కూడా అమ్మలా కనిపించేందుకు రిస్క్‌ తీసుకొని బరువు పెరిగి మీర ఈ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించిన విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.


By November 12, 2019 at 07:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jayalalitha-biopic-titled-thalaivi-shoot-begins-in-chennai/articleshow/72015707.cms

No comments