దేవీ, తమన్ల కన్నా ముందే ఆ నిర్ణయం తీసుకున్న మలయాళ మాంత్రికుడు

ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో గోపిసుందర్ ఒకడు. మలయాళ పరిశ్రమకు చెందిన గోపిసుందర్ టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. భలే భలే మొగాడివోయ్, మజ్ను, గీత గోవిందం లాంటి మ్యూజికల్ హిట్ సినిమాలతో గోపీసుందర్ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. మెలోడీ సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ మలయాళ మాంత్రికుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇన్నాళ్లు గోపిసుందర్ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోని తన స్టూడియో నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అయితే టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తుండటంతో హైదరాబాద్‌లో మరో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు గోపి సుందర్. హైదరాబాద్‌లో స్టూడియో ఉంటే బిగ్ స్టార్స్‌తో చర్చల జరిపేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నాడు. Also Read: గోపిసుందర్ సమకాలీకులైన తమన్, దేవీ శ్రీప్రసాద్‌లకు కూడా హైదరాబాద్‌లో స్టూడియోలు లేవు. వాళ్లు చెన్నైలోని స్టూడియోలలోనే కంపోజిషన్స్ చేస్తుంటారు. వాళ్లతో సినిమా చేయాలంటే చిత్ర యూనిట్ కూడా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమమయంలో గోపీసుందర్ ఇక్కడ స్టూడియో ఏర్పాటు చేస్తుండటంతో తమన్, దేవీలకు మరింత గట్టి పోటి ఇస్తాడని భావిస్తున్నారు. Also Read: ప్రస్తుతం ఈ మలయాళ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్, అల్లు అరవింద్ నిర్మిస్తున్న అఖిల్ 5, కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురాతో పాటు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాలకు సంగీతమందిస్తున్నాడు. Also Read:
By November 09, 2019 at 09:51AM
No comments