Breaking News

టిక్‌టాక్ ప్రియుళ్ల కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు.. తీరా చూస్తే


సోషల్‌మీడియా వినియోగం యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తాజా ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. టిక్‌టాక్‌లో పరిచయమైన యువకులు పెళ్లి చేసుకుంటాం వచ్చేమయని చెప్పడంతో ముందూ వెనుకా ఆలోచించకుండా వెళ్లిపోయారు అక్కాచెల్లెళ్లు. తీరా అక్కడికెళ్లాక ప్రియులు మొహం చాటేయడంతో ఏం చేయాలో తెలీక పోలీసులను ఆశ్రయించారు. Also Read: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు అన్నాదమ్ముల కూతుళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వారు ప్రస్తుతం తూఫ్రాన్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ తరుచూ టిక్‌టాక్‌లో వీడియోలు తీసి పోస్టు్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే యువతులకు ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు వంశీ, వన్నూరు స్వామి పరిచయమయ్యారు. Also Read: కొద్దిరోజుల పరిచయం తర్వాత ఈ రెండు జంటలు ప్రేమలోకి జారుకున్నాయి. రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. చివరకు ఓ రోజు.. ‘పెళ్లి చేసుకుందాం.. వచ్చేయండి’ అని స్వామి, వంశీ చెప్పడంతో ఆ యువతులిద్దరూ రైలెక్కేశారు. తీరా ప్రియుల వద్దకు వెళ్లాక పెళ్లి చేసుకోమంటూ వారు ప్లేటు ఫిరాయించారు. తమను వదిలేయొద్దని అమ్మాయిలు ఎంత వేడుకున్నా వారి మనసు కరగలేదు. దీంతో బాధితులు గ్రామపెద్దలకు ఆశ్రయించారు. అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవడంతో బొమ్మనహాళ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ, స్వామిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతులను కళ్యాణదుర్గంలోని ఉజ్వల్ హోమ్‌కు తరలించారు. ప్రియుళ్లు తిరస్కరించినా తాము వారినే పెళ్లాడతామని అమ్మాయిలిద్దరూ పట్టుబట్టుకుని కూర్చోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. సోషల్‌మీడియా జరిగేదంతా నిజమేనని గుడ్డిగా నమ్మితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి వదిలేయకుండా.. వారి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచితే ఇలాంటి ఉపద్రవాలే ఎదురవుతాయి. Also Read:


By November 09, 2019 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-yound-men-cheats-their-tiktok-lovers-in-anantapur/articleshow/71979334.cms

No comments