Breaking News

బంగారం విషయంలో వివాదం.. పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణహత్య


బంగారు నగల విషయంలో వచ్చిన వివాదాలతో ఓ యువకుడు సొంత పెద్దమ్మనే కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. తాకట్టు కోసం తీసుకున్న బంగారు నగలను ఎప్పుడిస్తావని అడిగిన పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి ప్రాణాలు తీశాడు. చెల్లెలి కుమారుడే కదా అని అవసరానికి సాయం చేసిన ఆ మహిళ తన ప్రాణాలే కోల్పోయింది. Also Read: గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో డేగల సుబ్బమ్మ(55) అనే మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆమెకు పొరుగు గ్రామమైన మోరవాగుపాలెంలో నివసించే పగడం రాజశేఖర్‌రెడ్డి స్వయానా చెల్లెలి కుమారుడు. గతంలో తనకు డబ్బు అవసరం ఉందని అడగ్గా సుబ్బమ్మ తన 16 సవర్ల బంగారు ఆభరణాలను ఇచ్చింది. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టిన రాజశేఖర్‌రెడ్డి ఇటీవల విడిపించి తన వద్దే ఉంచుకున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న సుబ్బమ్మ శనివారం తనఇంటి ముందుగా ట్రాక్టరుపై వెళ్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఆపింది. తన బంగారు నగలు తిరిగివ్వాలని కోరగా అతడు ఇవ్వనని తెగేసి చెప్పాడు. దీంతో తన ఆభరణాలు ఇచ్చే వరకు వెళ్లనివ్వనని సుబ్బమ్మ ట్రాక్టర్‌కు ఎదురుగా కూర్చుంది. కోపంతో రగిలిపోయిన రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ఆమెపై నుంచి నడిపాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనతో విస్తుబోయిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. Also Read:


By November 10, 2019 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-man-bruatally-kills-mothers-sister-over-family-disputes/articleshow/71989884.cms

No comments