Breaking News

వరకట్న వేధింపులు.. పెళ్లయిన ఆర్నెల్లకే రాలిపోయిన ‘దివ్య’


వరకట్న వేధింపులకు మరో మహిళ ప్రాణాలు తీసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. విశాఖ జిల్లా మునగపాకకు చెందిన పెంటకోట సన్యాసిరావు ముంచంగిపుట్ట మండల వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య(22) అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ పూర్తిచేసింది. Also Read: దివ్యకు అనకాపల్లి గవరపాలెంకు చెందిన బుద్ధ చైతన్య అనే యువకుడితో మే 18వ తేదీన ఘనంగా వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.4లక్షల కట్నం, 12తులాల బంగారంతో పాటు మరో లక్ష రూపాయల విలువైన సారె అందజేశారు. అయితే పెళ్లయిన నెలరోజులకే దివ్యకు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఇద్దరు ఆడపడుచులు ఆమె తీవ్రంగా వేధించారు. ఈ క్రమంలోనే పది రోజుల కిత్రం భర్త దివ్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. Also Read: అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న దివ్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగేసింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి పూర్ణ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఆమెను కారులో హుటాహుటిన అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది. తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని ఆమె తండ్రి సన్యాసిరావు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన ఆరుమాసాలకే కుమార్తె మృతి చెందడం పట్ల ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Also Read:


By November 10, 2019 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-young-woman-commits-suicide-over-dowry-harassment/articleshow/71989973.cms

No comments