Breaking News

కోట్లు కొల్లగొడుతున్న `ఖైదీ`.. కార్తీ కెరీర్‌ బెస్ట్‌


కోలీవుడ్‌ స్టార్ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఖైదీ. మా నగరం ఫేం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల తరువాత విడుదలైన ఓ తన కూతురిని తొలిసారిగా చూసేందుకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన బిగిల్‌కు పోటిగా రిలీజ్‌ అయిన ఖైదీ హిట్ టాక్‌ సొంతం చేసుకోవటమే కాదు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. రిలీజ్‌ రెండు వారాలు కావస్తున్నా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లో కార్తి కెరీర్‌ బెస్ట్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూళ్ల సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. Also Read: కార్తి గత చిత్రాలు ఆశించిన స్థాయిల సక్సెస్‌ కాకపోవటంతో ఖైదీపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లేమీ దక్కలేదు. తొలిరోజు 3.5 కోట్లు వసూళ్లు చేసిన ఖైదీ రెండో 2.8 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు భారీగా పెరిగాయి. మూడో రోజు 4.7 కోట్లు సాధించిన ఈ సినిమా తొలి వారాంతానికి కేవలం తమిళనాడులోనే 11 షేర్‌, 25 కోట్ల గ్రాస్‌ సాధించినట్టుగా ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. Also Read: తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఖైదీ తొలి పది రోజుల్లో 70 కోట్లకు పైగా గ్రాస్‌ సాదించింది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్ల మార్క్‌ను దాటినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి 100 కోట్ల మార్క్‌ను కూడా ఈజీగా అందుకోవటం కాయంగా తెలుస్తోంది. ఖైదీకి పోటిగా రిలీజ్‌ అయిన విజయ్‌ బిగిల్‌ ఇప్పటికే వసూళ్లు విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విజయ్‌, అట్లీ కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్‌ చేయటంతో బిగిల్ ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. Also Read:


By November 06, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthi-lokesh-kanagaraj-khaidi-box-office-collection/articleshow/71933552.cms

No comments