Breaking News

పాకిస్థాన్ వెళ్తున్న పూనమ్ కౌర్.. ఎందుకంటే..!


పాకిస్థాన్‌కు పూనమ్ వెళ్లడమేంటి..? కొంపదీసి టాలీవుడ్‌ను వదిలేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోతోందా..? అని ఆశ్చర్యపోతున్నారా.. అదేం కాదండోయ్.. జస్ట్ చూసి రావడానికి మాత్రమే.. ఇంతకీ ఆమె ఎందుకు వెళ్తోంది ..? ఎందుకు ఈ బ్యూటీనే ఆ పాటలో తీసుకున్నారు..? ఈమెకు ఎందుకు ఆహ్వానం వచ్చింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. భారతీయ సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ కారిడార్‌ను ఈ నెల 9న పాక్ అట్టహాసంగా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమం గురునానక్ 550వ జయంతి సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌లో ఉన్న డేరా బాబా నానక్ విగ్రహం నుంచి పాకిస్థాన్‌లోని కర్తార్ పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మించారు. ఈ కారిడార్‌ ఓపెనింగ్‌కు గాను రావాలని పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. వారిలో పూనం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆప్తుడు, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ, హర్ సిమ్రత్ కౌర్‌లు ఉన్నారు.

ఈ మేరకు పాక్ ఓ పాటను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో పూనం కూడా ఉంది. పాక్ ప్రారంభించబోతున్న ఈ యాత్రతో సిక్కు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురునానక్ పుట్టిన, మరణించిన రెండు స్థలాలు పాక్‌లోనే ఉన్నాయన్న విషయం విదితమే. ఆయన జన్మస్థలం లాహోర్‌లోని నాన్‌ కనాసాహిబ్‌ కాగా.. కర్తార్‌పూర్‌లో కన్నుమూశారు. దీంతో సిక్కులంతా దాన్ని పవిత్రస్థలంగా భావిస్తారు. భారత భూభాగంలో 8న మోదీ.. పాక్ భూభాగంలోని కారిడార్‌ను నవంబర్ 9న ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించబోతున్నారు.



By November 07, 2019 at 02:48AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48158/tollywood.html

No comments