Breaking News

మత్తులో వీరంగం.. బంజారాహిల్స్ పోలీసులను చుక్కలు చూపించిన మహిళ


మద్యం తాగితే మనిషికి మృగానికి తేడా ఉండదంటారు. అది నిజమేనని నిరూపించిందో మహిళ. మద్యం మత్తులో ఉన్న తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడింది. మహిళ కదా అని ఉపేక్షించిన పోలీసులకు భయానక అనుభవాన్ని మిగిల్చింది. మహిళా ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లపై దాడి చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగింది. Also Read: బంజారాహిల్స్‌ జహీరానగర్‌ ప్రాంతంలో లీసా అనే మహిళ మద్యం మత్తులో రోడ్డు పక్కన పడిపోవడంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాసేపటి తర్వాత మత్తు నుంచి తేరుకున్న ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెను పట్టుకునేందుకు ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ప్రయత్నించారు. దీంతో వారిని బండబూతులు తిడుతూ దాడికి పాల్పడింది. ఓ కానిస్టేబుల్ చేతికి కొరగ్గా, మరో కానిస్టేబుల్ మెడపై గోళ్లతో రక్కేసింది. చివరికి ప్రయత్నించిన మహిళా పోలీసులు లీసాను గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టారు. Also Read: అయినా రెచ్చిపోయిన లీసా తనను వదిలిపెట్టకపోతే అందరి అంతు చూస్తానంటూ బెదిరించింది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నించగా.. తనది నాగాలాండ్ రాష్ట్రమని, మాదాపూర్‌లోని ఓ సంస్థలో పనిచేస్తున్నానని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనను బట్టి డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలిసిన తర్వాత సంబంధీకులకు సమాచారమిస్తామని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు. ఓ మహిళ మత్తులో పోలీసులకు ముచ్చెమటలు పోయించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. Also Read:


By November 17, 2019 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunk-woman-attacks-police-in-banjarahills-police-station/articleshow/72091796.cms

No comments