Breaking News

సూపర్‌ ఫాం.. అరడజను సినిమాలు లైన్‌లో పెట్టిన స్టార్‌ హీరో


సక్సెస్‌ విషయం పక్కన పెడితే కోలీవుడ్ స్టార్‌ హీరో సూపర్‌ ఫాంలో ఉన్నాడు. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగా బిజీగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం గురు ఫేం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటిస్తున్నాడు సూర్య, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుంది. Also Read: ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా వరుసగా లైన్‌లో పెట్టాడు ఈ విలక్షణ నటుడు. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్గా నిలిచిన సినిమా సిరీస్‌ సింగం. మూడు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. సింగం సిరీస్‌ను తెరకెక్కించిన హరి దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక అజిత్ హీరోగా వరుస బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సూర్య. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. Also Read: సూర్య కెరీర్‌ను మలుపు తిప్పిన కాకా కాకా, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఓకె అవుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Also Read: కోలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్న మరో దర్శకుడు వెట్రీమారన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇటీవల అసురన్‌తో ఆకట్టుకున్న వెట్రీమారన్‌ను కథ చెప్పిమని కోరాడట సూర్య. అంతేకాదు కార్తి హీరోగా ఖైదీలాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందించిన లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. వీటితో పాటు ఓ కొత్త దర్శకుడితోనూ సూర్య కథా చర్చలు జరుపుతున్నాడట. Also Read:


By November 17, 2019 at 09:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kollywood-star-hero-suriyas-impressive-line-up-of-movies/articleshow/72092010.cms

No comments