Breaking News

ట్యూషన్‌కు వచ్చే బాలికను ప్రియుడితో రేప్ చేయించిన టీచర్


మంచి చదువు చెబుతుందని నమ్మి తల్లిదండ్రులు ఆమె వద్దకు పిల్లలను పంపిస్తే ఆ ట్యూషన్ టీచర్ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా.. కొందరిని అతడితో రేప్ చేయించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోలు బయటపెడతానని బెదిరించింది. రాజధాని చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: చెన్నైకి చెందిన సంజన(28) అనే వివాహిత స్థానికంగా 10-12 తరగతుల విద్యార్థులకు ట్యూషన్ చెబుతుండేది. ఆమెకు బాలాజీ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. సంజన భర్త ఇంట్లో లేని సమయంలో బాలాజీ ఆమె ఇంటికి వచ్చి రాసలీలలు కొనసాగిస్తుండేవాడు. సంజన ట్యూషన్ చెబుతున్న సమయంలో అప్పుడప్పుడు బాలాజీ అక్కడికి వచ్చి అసభ్యంగా మాట్లాడేవాడు. అమ్మాయిల ముందు వికృత చేష్టలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక(15) ఇటీవల ట్యూషన్‌లో చేరింది. ఆమెపై కన్నేసిన బాలాజీ ఓ రోజు ఎవరూ లేని సమయంలో చూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఈ విషయాన్ని బాలిక సంజనకు చెప్పడంతో ఆమె షాకైంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన అక్రమ సంబంధం గురించి కూడా తెలిసిపోతుందని భయపడిన సంజన దీని గురించి ఎవరికీ చెప్పొద్దని బాలికను హెచ్చరించింది. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమెపై మరోసారి అత్యాచారం చేయించి దాన్ని వీడియో తీసింది. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని డబ్బులు తేవాలంటూ బాధితురాలిని వేధించింది. దీంతో ఆ బాలిక ఇంట్లో డబ్బులు దొంగిలించి ట్యూషన్ టీచర్ సంజనకు ఇచ్చేది. ఇంట్లో తరుచూ డబ్బులు మాయం కావడంతో బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సంజన, బాలాజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంజన గతంలోనూ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన బాలికలను ఇలాగే వేధించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమె బారిన పడిన బాధితుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. Also Read:


By November 07, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-woman-her-borfriend-arrested-for-sexual-assault-on-minor-girl/articleshow/71949481.cms

No comments