Breaking News

Bheeshma Teaser: పవన్‌ కళ్యాణ్‌ ఫార్ములాను వదలని నితిన్‌!


సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీష్మ. సింగిల్‌ ఫరెవర్‌ అనేది ఈ సినిమా ట్యా్గ్‌ లైన్‌. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో రిలీజ్ అయిన టీజర్‌లో సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్‌ ఇచ్చారు. `నా ప్రేమ విజయ్‌ మాల్యా లాంటిది రా.. కనిపిస్తుంది కానీ క్యాచ్‌ చేయలేం` అంటూ నితిన్‌ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ను కట్‌ చేశారు. అయితే తనని తాను వీరాభిమానిగా చెప్పుకునే నితిన్‌, ఈ సినిమాలో కూడా పవన్‌ కళ్యాణ్‌ను ఫాలో అయ్యాడు. పవన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటైన ఖుషీ సినిమాలో నడుము సీన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. Also Read: ఆ సినిమా సక్సెస్‌లో ఆ సీన్‌ కీ రోల్ ప్లే చేసిందనటంలో సందేహం లేదు. తరువాత కూడా నడుము సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ పవన్‌ సినిమాలో అలాంటి సీన్స్‌ రూపొందించారు. అదే ఫార్ములాను ఫాలో అయిన నితిన్‌ తొలి టీజర్‌లోనే హీరోయిన్‌ నడుము పట్టుకునేందుకు ఆమె వెంటపడుతున్న సీన్‌లో టీజర్‌లో రిలీజ్ చేశారు. క్లాస్‌ లుక్‌లో నితిన్‌, రష్మికలు సూపర్బ్ అనిపించేలా ఉన్నారు. Also Read: ఛలో సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.


By November 07, 2019 at 10:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiin-rashmika-mandanna-starrer-bheeshma-first-glimpse/articleshow/71949457.cms

No comments