Breaking News

2నెలల క్రితం ప్రేమ వివాహం... వేధింపులతో యువతి ఆత్మహత్య


అత్తింటి వేధింపులతో పెళ్లయిన రెండు నెలలకే యువతి చేసుకున్న విషాద ఘటన జిల్లా మదనపల్లెలో జరిగింది. ములకలచెరువు మండలం గూడుపల్లెకు చెందిన నరసింహులు కుమార్తె అమరావతి (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది. కురబలకోట మండలం గౌనివారిపల్లెకు చెందిన రుక్మాంగదను ప్రేమించి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. Also Read: బెంగళూరు నుంచి వచ్చిన ఆమె గ్రామంలో పొలం పనులు చేయడం లేదని అత్తింటివారు వేధింపులకు చేసేవారు. మనస్తాపం చెందిన అమరావతి గత నెల 19న అత్తింట్లోనే పురుగుల మందు తాగేసింది. దీంతో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తీసుకెళ్లారు. Also Read: ఈ ఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని తమ కూతురిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. తమ కుమార్తె చావుకు భర్త రుక్మాంగద, అతని తాత వెంకటసుబ్బన్న, తల్లి వెంకటలక్ష్మి, తండ్రి లక్ష్మన్న వేధింపులే కారణమని అమరావతి తల్లిదండ్రులు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుకుమార్ తెలిపారు. Also Read:


By November 15, 2019 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-over-harassment/articleshow/72065208.cms

No comments