Breaking News

ప్రియుడితో కలిసి భర్త హత్య.. బెడిసికొట్టిన గుండెపోటు ప్లాన్


నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేయడంతో పాటు, తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంగా ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. అయితే గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. Also Read: నల్గొండ జిల్లా నేరెడుచర్ల మండలం పందిరిగుండు తండాకు చెందిన పలావత్‌ ప్రసాద్‌బాబు(38), సరోజ దంపతులకు ఇద్దరు సంతానం. బతుకుదెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చిన ప్రసాద్‌బాబు ఆటో నడుపుతూ కుటుంబంతో ఎల్బీనగర్‌ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌ వెంకటేశ్వరకాలనీలో ఉంటున్నాడు. గతంలో చిట్టీల వ్యాపారం నిర్వహించి నష్టం రావడంతో రూ.40లక్షల వరకు అప్పులు చేశాడు. ఆస్తులు అమ్మి రూ.25లక్షల అప్పు తీర్చగా ఇంకా రూ.15లక్షల వరకు అప్పు మిగిలింది. సంపాదన కుటుంబ పోషణకే సరిపోవడంతో అప్పుల తీర్చే మార్గం కనిపించక మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి వేధిస్తుండటంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ సరోజకు బొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నర్సింహతో పరిజయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. Also Read: కొంతకాలం తర్వాత పెద్దమనుషుల సలహాతో సరోజ భర్త వద్దకు వెళ్లింది. అయినప్పటికీ నర్సింహ తరుచూ వస్తూ ప్రియురాలితో రాసలీలలు కొనసాగించేవాడు. భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని సరోజ ప్రియుడితో చెప్పడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నర్సింహ తన స్నేహితుడైన సాహెబ్‌నగర్‌కు చెందిన రామకృష్ణ సాయం కోరాడు. పథకం ప్రకారం ఈ నెల 6వ తేదీన నర్సింహ, రామకృష్ణ సరోజ ఇంటికి వెళ్లారు. వాళ్లిద్దరు తనకు తెలిసిన వారని, ఫైనాన్స్ ఇస్తుంటారని భర్తకు పరిచయం చేసింది. దీంతో ప్రసాద్‌బాబు వారితో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉండగా నర్సింహ, రామకృష్ణలు అతని మెడకు టవల్‌ను చుట్టి గొంతు నులిమి చంపేసి వెళ్లిపోయారు. Also Read: రాత్రి 2.30 గంటల సమయంలో సరోజ సోదరుడు లక్ష్మణ్‌కు ఫోన్‌ చేసి తన భర్తకు గుండెనొప్పి వచ్చిందని, త్వరగా రావాలని కోరింది. అతను వచ్చేసరికే ప్రసాద్ మృతి చెందాడని అందరినీ నమ్మించి మృతదేహాన్ని గ్రామానికి తరలించింది. అంత్యక్రియలు నిర్వహించే సమయంలో మృతదేహంపై గాయాలున్నట్లు కుటుంబసభ్యులు గమనించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు సరోజను తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు నర్సింహ, రామకృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్పీనగర్ డీసీపీ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. Also Read:


By October 16, 2019 at 12:39PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-help-of-lover-in-hyderabad/articleshow/71610435.cms

No comments