Breaking News

టార్గెట్ చంద్రబాబు .. మంత్రి వీడియోతో వర్మ ట్వీట్


అమ్మో తక్కువోడేం కాదు.. ఓ చేత్తో సినిమాలు, మరో చేత్తో రాజకీయాలు చేస్తున్నారు. డైరెక్షన్ సంగతి అటుంచితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత వర్మ రాజకీయాలు బాగా వంటపట్టించుకున్నారు. వైసీపీ గెలుపు తర్వాత రాజకీయాల్లోకి అప్పుడప్పుడు తొంగి చూస్తున్నారు. చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తూ.. జగన్‌ను పొగుడుతూ బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు ఆర్జీవీ. తాజాగా చంద్రబాబుపై మళ్లీ ట్వీట్ బాంబులు పేల్చారు. వర్మ చంద్రబాబును టార్గెట్ చేయడానికి ఈసారి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను వాడేశారు. తన వెటకారాన్ని కాస్త జోడించి ఓ ట్వీట్ చేశారు. అందులో ‘వైసీపీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ అంటే ఇష్టం.. ఆయన ఈ వీడియోలో నా మనసును తాకేలా చంద్రబాబును ఎక్స్‌పోజ్ చేశారు. వైసీపీలో బుగ్గనలాంటి ఓ ఐదు, పదిమంది మేధావులు ఉంటే ముఖ్యమంత్రి జగన్ బలం పెరిగిపోతుంది’అన్నారు. వర్మ ట్వీట్ చేసిన వీడియోలో ఏముంది రాంగోపాల్ వర్మ చేసిన వీడియోలో బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రబాబును టార్గెట్ చేశారు. బాబు ఇంగ్లీష్ తమకు అర్ధం కావడం లేదంటూ సెటైర్లు పేల్చారు. ఆ ఇంగ్లీష్‌కు చంద్రబాబే అర్ధం చెప్పాలన్నారు. మూడున్నర నిమిషాలు పాటూ ఉన్న ఈ వీడియోను ట్వీట్‌తో పాటూ షేర్ చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ.


By June 28, 2019 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/director-ram-gopal-varma-satires-on-chandrababu-naidus-english-skills/articleshow/69985302.cms

No comments