Breaking News

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. ‘ఆచార్య’కు బ్రేక్


కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సోకింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. Also Read: కొరటాల శివ దర్శకత్వంలో తెరుకుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కొద్దిరోజుల్లో ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యూనిట్ సభ్యులంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఇండస్ట్రీ షాకైంది. దీంతో ‘ఆచార్య’ షూటింగ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొద్దిరోజుల క్రితం చిరంజీవి సోదరుడు నాగబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.


By November 09, 2020 at 11:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-tests-coronavirus-positive/articleshow/79123173.cms

No comments