అలాంటి సినిమాలే చేస్తానంటున్న చెర్రీ... కథలు చెక్కుతున్న రైటర్లు

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ‘’ సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే.. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మిగతా హీరోలు ఓ సినిమా చేస్తుండగానే మరో రెండు మూడు ప్రాజెక్టులు లైనులో పెట్టేస్తుంటే మాత్రం నెక్ట్స్ ప్రాజెక్టుపై కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది డైరెక్టర్లు ఆయనకి కథలు వినిపించినా ఏదీ ఫైనల్ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాక చరణ్ తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయన్న సంగతి తెలిసిందే. గతంలో చాలామంది హీరోలు పవర్‌ఫుల్ పాత్రల్లో నటించిన తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న అనుభవం ఉంది. అందువల్ల తాను తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న దానిపై చెర్రీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళితో ‘మగధీర’ లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న చరణ్ ఆ తర్వాత ‘ఆరెంజ్’తో చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచనలో పడిన చరణ్ పవర్‌ఫుల్ స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాడు. Also Read: పాన్ ఇండియా టార్గెట్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఆ రేంజ్‌కు తగిన కథతోనే సినిమా చేయాలని చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వద్దకు వచ్చిన దర్శకులంతా కమర్షియల్ కథలే వినిపిస్తుండటంతో మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తున్నాడట. పాన్ ఇండియా సినిమాకు తగ్గ స్క్రిప్టుతో తన దగ్గరకు రావాలని చెబుతుండటంతో కొందరు రచయితలు, డైరెక్టర్లు అందుకు తగిన కథల చెక్కే పనిలో పడ్డారట. గతంలో రామ్‌చరణ్ తమిళ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ ‘ధ్రువ’లో నటించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘తని ఒరువన్’ డైరెక్టర్ మోహన్ రాజా సిద్ధం చేసిన కథ చరణ్‌కు తెగ నచ్చేసిందని, ఓకే చెప్పేశాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే దానిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అది రూమర్‌గా భావించాలి. మరి ఈ మెగా పవర్‌స్టార్‌తో సినిమా తెరకెక్కించే లక్కీఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని టాలీవుడ్‌లో ఎదురుచూస్తోంది. Also Read:
By November 06, 2020 at 09:47AM
No comments