షాపు ముందు అటూఇటూ తిరిగిన ఆటో.. ఆరా తీస్తే షాకింగ్

ఎరువుల దుకాణం షట్టర్‌ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారు. షాపులో పెట్టిన నగదు దోచుకెళ్లారు. దుకాణం పగలగొట్టి మరీ దోపిడీ చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దుకాణం వద్ద అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టి ఓ ఆటోను గుర్తించారు. షాపు ముందు అటూఇటూ తిరగడం గమనించి ఆ దిశగా విచారణ చేపట్టడంతో అంతర్రాష్ట్ర దొంగలు పట్టుబడ్డారు. ఈ షాకింగ్ ఘటన జిల్లాలో జరిగింది. మండలం గాజులపల్లె మెట్ట వద్ద ఉన్న ఎరువుల దుకాణంలో ఈ నెల 23న చోరీ జరిగింది. రాత్రివేళ షాపు షట్టర్ పగలగొట్టిన దుండగులు దుకాణంలో ఉంచిన రూ.15 వేల నగదు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా షాపు ముందు అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. ఆ ముందు రోజు ఓ ఆటో షాపు ముందుగా అటూఇటూ తిరగడం గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. ఆటో నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. Also Read: రుద్రవరం మండలం పందిర్లపల్లికి చెందిన మల్లేష్ అలియాస్ శివ, కోటకొండ గ్రామానికి చెందిన నాగేష్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గతంలో మల్లేష్ బెంగళూరుతో పాటు ఏపీలోని పలు పట్టణాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్వగ్రామానికి వచ్చేశాడు. నాగేష్‌తో కలసి ఎరువుల దుకాణంలో చోరీ చేశాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. Read Also:
By November 01, 2020 at 11:52AM
No comments