Breaking News

తలకిందులైన వంటింటి బడ్జెట్.. ఏడాదిలోనే 92 శాతం మేర పెరిగిన ఆలూ ధరలు


ఒక్క గోధుమ తప్ప దేశవ్యాప్తంగా సగటున అన్ని ఆహార వస్తువుల ధరలు గతేడాదితో పోల్చితే భారీగా పెరిగాయి. ఇక, 92 శాతం మేర పెరిగితే ఉల్లిపాయలు 44 శాతం మేర పెరగడం గమనార్హం. అధిక ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తమవుతుండగా.. నిపుణులు మాత్రం ఇది తాత్కాలికమేనని, సరఫరా మెరుగుపడిన తర్వాత ధరలు దిగివస్తాయని అంటున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను విశ్లేసిస్తే గతేడాదితో పోల్చితే ఆలూ గడ్డలు ధరలు 108 శాతం మేర పెరిగినట్టు వెల్లడయ్యింది. గతేడాది ఇదే సమయానికి క్వింటాళ్లకు రూ.1739 ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.3,633కి చేరింది. ఇదే సమయంలో కూడా 47 శాతం మేర పెరుగుదల నమోదుచేసింది. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లిగడ్డలు రూ.5645 పలికాయి. గతేడాది ఇది రూ.1739గా ఉంది. ఆలూ, ఉల్లితోపాటు ఇతర నిత్యావసర ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం ధోరణి ఆహార ధాన్యాల ధరలపై ఎలా ఒత్తిడి తెస్తున్నాయో చూపుతోంది. ఇక, గడచిన ఐదేళ్ల కిందటతో పోల్చితే ఆలూ ధరలు 158 శాతం మేర పెరిగాయి. బంగాళాదుంపలపై స్టాక్ పరిమితిని విధించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ధరలు మరింత పెరిగితే, ఆలూ దిగుమతితో సహా అన్ని చర్యలు తీసుకుని ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ సమాచారం ముఖ్యంగా కూరగాయలు, మాంసం, చేపలు, పప్పుధాన్యాల అధిక ఆహార ధరల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించే ప్రక్రియను నిలిపివేసింది. ‘చాలా నెలలుగా ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ద్రవ్య విధాన కమిటీ తీర్పు ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం, సప్లయ్ ఛైన్ పునరుద్ధరణ, కార్యాచరణ సాధారణీకరణ వంటి అంతర్లీన కారకాల వల్ల రాబోయే రోజుల్లో ప్రభావం చూపుతాయి’అని అక్టోబరు ప్రారంభంలో ఏంపీసీ తన ప్రకటనలో తెలిపింది. టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి కీలకమైన కూరగాయల ధరలపై ఒత్తిడి కూడా ఖరీఫ్ రాకతో మూడో త్రైమాసికం నాటికి తప్పదని ఆర్బీఐ పేర్కొంది. మరోవైపు, దిగుమతి సుంకాలను పెంచడం వల్ల పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. దేశంలో అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్తర్ ప్రదేశ్, తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లోనే పండిస్తారు. గతేడాది యూపీలో 15.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది ఇది 12.4 మిలియన్లకే పరిమితం కానుంది. అటు బెంగాల్‌లోనూ గతేడాది 11 మిలియన్ల పంట ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం 8.6-9 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


By November 01, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/potato-prices-up-92-in-one-year-onions-by-44-past-one-year/articleshow/78977708.cms

No comments